![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -200 లో.. మురారి కృష్ణ ఇద్దరు ఫామ్ హౌస్ నుండి ఇంటికి వస్తారు. కృష్ణ, మురారిల కంటే ముందుగా వచ్చిన ముకుంద.. మురారి డైరీని కృష్ణ చూడాలని కబోడ్ లోని బట్టలలో పెడుతుంది. కృష్ణ బట్టలు సర్దుతుంటుంది. ఆ బట్టల్లో తన డైరీని చూసిన మురారి.. వెంటనే కృష్ణ చూడకముందే డైరీని తీసుకుంటాడు. ఆ డైరీలో ఏదో ఉందని చూసేసరికి.. ముకుంద తన ప్రేమని డైరీ లో రాయడం చూసి.. మురారి కోపంగా పేపర్ చింపేస్తాడు.
ఆ తర్వాత మురారి ఆలోచిస్తుంటాడు. ఏంటి ఏసీపీ సర్ మీరు ఇంకా వెళ్ళలేదా అని కృష్ణ అడుగుతుంది. నువ్వు వస్తే చెప్పి వెళదామని వెయిట్ చేస్తున్న అని మురారి అంటాడు. మీరు నాకు అబద్ధం చెప్తున్నారని కృష్ణ అనగానే.. లేదు కృష్ణ నీకు అబద్ధం చెప్పనని మురారి అంటాడు. ఇంత టెన్షన్ ఎందుకు నా ప్రేమ గురించి చెప్పేస్తా అని మురారి కృష్ణ చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్తాడు. మరొక వైపు కృష్ణ, మురారిలు ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు జరిగిన విషయాలు గురించి ముకుంద ఆలోచిస్తుంటుంది. కృష్ణని మురారి ప్రేమిస్తే నా పరిస్థితేంటని ముకుంద అనుకుంటుంది. మురారి, కృష్ణని ప్రేమిస్తే.. కృష్ణ మురారిని ప్రేమిస్తుందా.. నా ప్రేమని నేను వదులుకొనని ముకుంద తన ప్రేమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మరొక వైపు కృష్ణని బయటకు తీసుకొని వచ్చిన మురారి.. ఒక దగ్గర కార్ ఆపి కృష్ణకి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు.
ఏసీపీ సర్ డైరీ అమ్మాయి గురించి చెప్తాడని కృష్ణ అనుకుంటుంది. మురారి తన ప్రేమని చెప్పడానికి ధైర్యం చాలక.. ఇండైరెక్ట్ గా కృష్ణకి ప్రశ్నలు వేస్తాడు. కృష్ణ మాత్రం తన ప్రేమ బయటపడకుండా సమాధానం చెప్తుంది.. ఎలాగైనా అగ్రిమెంట్ మ్యారేజ్ ని పర్మినెంట్ చేద్దాం కృష్ణ అని మురారి చెప్పాలనుకుంటాడు. అప్పుడే రేవతి ఫోన్ చేసి.. కృష్ణని ఎక్కడికి తీసుకొని వెళ్ళావని మురారిని అడుగుతుంది.. షాపింగ్ కి తీసుకొని వెళ్ళమని కృష్ణ చెప్తే.. తీసుకొని వచ్చానని మురారి చెప్తాడు.
ఆ తర్వాత రేవతితో కృష్ణ మాట్లాడుతుంది. అత్తయ్య నన్ను రిటర్న్ రమ్మంటున్నారని అబద్దం చెప్తుంది కృష్ణ. ఎక్కడ మురారి తన డైరీ అమ్మాయి గురించి చెప్తాడోనని, అది విని తట్టుకోలేనని భావించిన మురారికి అబద్ధం చెప్తుంది. మీరు ఏదో చెప్తానన్నారని కృష్ణ అనగానే.. తర్వాత చెప్తానని మురారి అంటాడు. ఆ తర్వాత కృష్ణ ఇంటికి వస్తుంది. ఇంటిముందు ముకుంద చెప్పులు చూసి షాక్ అవుతుంది. ఫామ్ హౌస్ లో చూసిన చెప్పులను గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |